ఆర్‌యూ నోటిఫికేషన్ విడుదల
మార్చి 2015లో రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలో జరిగే డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలకు నోటిఫికేషన్‌ను మంగళవారం ఆర్‌యూ అధికారులు విడుదల చేశారు. ఈ షెడ్యూల్ కాపీని కాపీని ఆయా కళాశాలలకు మెయిల్ పంపారని ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఈ నెల 24 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని డీన్ ఆఫ్ ఎగ్జామినర్ ఆచార్య ఎన్‌టీకే నాయక్ తెలిపారు. సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఉంటుందని ఆయన తెలిపారు.