పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాశ్ హీరోగా అరంగేట్రానికి రంగం సిద్ధమైంది

బాలనటునిగా ఉన్నప్పుడే…  ‘చిరుత, బుజ్జిగాడు… మేడిన్ చెన్నై, గబ్బర్‌సింగ్, ధోనీ’ తదితర చిత్రాల్లో నటించిన పూరి ఆకాశ్ హీరోగా అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. అయితే… అందరూ ఊహించినట్లు ఈ చిత్రానికి తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకుడు కాదు. ‘ఋషి’ ఫేం రాజ్ ముదిరాజ్ దర్శకుడు. సినిమా పేరు ‘ఆంధ్రాపోరి’. ప్రసాద్ సంస్థల అధినేత ఎ.రమేశ్‌ప్రసాద్ నిర్మాత. మరాఠీలో ఘనవిజయం సాధించిన ‘టైంపాస్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందతోన్న ఈ చిత్రంలో ఆకాశ్‌కు జోడీగా ఉల్కా గుప్తా నటిస్తున్నారు. […]