power problem in vishakapatnam

హుదూద్ తుఫాను వల్ల విద్యుత్ సరఫరా లేక జనాలు తీవ్ర కష్టాలు

హుదూద్ తుఫాను విలయ తాండవానికి చాలా గ్రామాల ప్రజలు జనరేటర్ల దగ్గరకు వెళ్లి డబ్బులు ఇచ్చి మరీ సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టించుకుంటున్నారు. మన్యంలో పలుచోట్ల సెల్ టవర్లు దెబ్బతినటంతో అయిదు రోజులుగా సెల్ ఫోన్లు పనిచేయటం లేదు. ఛార్జింగ్ పెట్టుకుందామంటే విద్యుత్ సరఫరా లేదు. తమవారి క్షేమ సమాచారాల కోసం  ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.