Photo Stills

స్వచ్ఛ భారత్ అంటే చేతిలో చీపురు పట్టుకుని ఫోటోలకు ఫోజులివ్వడం కాదు : పవన్ కళ్యాణ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అంటే చేతిలో చీపురు పట్టుకుని ఫోటోలకు ఫోజులివ్వడం కాదని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘స్వచ్ఛభారత్‌ అంటే ఫొటోలు తీసుకోవడం కాదు. ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినప్పుడే పరిశుభ్రమైన సమాజం అవతరిస్తుంది’ అని అన్నారు.