Petrol become a lowest price in feature

భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు రూ.60 కంటే దిగువకు పడిపోయే అవకాశం…

భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు గణనీయంగా పడిపోనున్నాయి. దాదాపు లీటరు పెట్రోల్ ధర రూ.60 కంటే దిగువకు పడిపోయే అవకాశం ఉన్నట్టు చమురు రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు గణనీయంగా తగ్గిపోతున్న విషయం తెల్సిందే. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగినట్టయితే మరింతగా పడిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం 75 డాలర్ల వద్ద కొనసాగుతున్న బ్యారల్ ముడిచమురు ధర 60 డాలర్ల వరకూ తగ్గనుంది.