Pawan Kalyan

విక్టరీ వెంకటేష్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కలిసి నటిస్తున్న”గోపాల గోపాల” పోస్టర్లు విడుదల

విక్టరీ వెంకటేష్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమా “గోపాల గోపాల” చిత్రానికి సంబంధించి పోస్టర్లను  తాజాగా న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం విడుదల చేశారు. ఈ లుక్‌లో పంచకళ్యాణి రథంపై కృష్ణార్జునలను తలపించేలా ఉన్న ఈ పోస్టర్‌ మరింత ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల పై అటు విక్టరీ అభిమానులతో పాటు పవర్‌స్టార్‌ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘

‘గోపాల గోపాల’ చిత్రానికి సంబంధించి స్టిల్స్‌….

డిసెంబర్‌ 13 విక్టరీ వెంకటేష్‌ పుట్టిన రోజు సందర్భంగా వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘గోపాల గోపాల’ చిత్రానికి సంబంధించి స్టిల్స్‌ను విడుదలచేశారు.. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ పై మరింత అంచనాలు పెరిగాయి. ఇప్పుడు  వెంకటేష్‌ బర్త్‌డే్ కానుకగా ఈ చిత్రంలోని వెంకటేష్‌ స్టిల్స్‌ను విడుదల చేయడం వెంకీ అభిమానులకు ఆసక్తిని  కలిగిస్తోంది.

‘మేము సైతం’… అన్నయ్య ‘జీరో’ అవుతాడనే పవర్ స్టార్ రాలేదా…?

మేము సైతం ప్రోగ్రాముకు టాలీవుడ్ ఇండస్ట్రీ నటీనటులు, సాంకేతిక వర్గం అంతా వచ్చింది. కానీ అందరిచూపు పవర్ స్టార్ ఎప్పుడొస్తాడా అని చూచారు. కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినపుడయినా పవన్ తళుక్కుమంటాడేమోనని ఎదురుచూశారు. కానీ పవన్ కళ్యాణ్ జాడే లేదు. పైగా ఆయన నిన్న ఆదివారంనాడు హైదరాబాదులోనే ఉన్నాడనే సమాచారం.  మరి హైదరాబాదులోనే ఉండి ఎందుకు రాలేదబ్బా అనే చర్చ కూడా జరిగింది. ఐతే దీనిపై పలువురు పలు రకాలుగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ […]

గ్రేటర్ ఎన్నికల భరిలోకి పవన్ జనసేన

ఇటివలే జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ని ప్రారంబించిన పవన్ కళ్యాణ్ తన మద్దతు అటు టిడిపి , ఇటు బిజెపి కి అందించిన విషయం తెలిసిందే . పార్టీ ప్రచారం లో కుడా పాల్గొని తనదైన శైలి లో ఆకట్టుకున్నాడు కుడా . అయితే ఇప్పుడు జనసేన పార్టీ ని ఎన్నికలలోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాడు పవన్ . త్వరలోనే హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి . ఈ ఎన్నికలతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు […]

తిరుపతిలో ‘పవన్ ప్రాణదాత హెల్త్ కార్డ్’

పవన్ మీద అభిమానంతో పవనిజం అనే కొత్త కాన్సెప్ట్‌నే తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాన్ ఫ్యాన్స్‌ది. ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ మీద అభిమానంతో అతడి విగ్రహం కూడా పెట్టేశారు కొందరు అభిమానులు. ఐతే తాజాగా తిరుపతిలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పవన్ అభిమాన సేన. పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ‘పవన్ ప్రాణదాత హెల్త్ కార్డ్’ను ప్రారంభిస్తోంది అభిమాన సంఘం. విరాళాలు సేకరించడంతో పాటు అభిమానుల నుంచి కొంత రుసుము తీసుకుని ఈ […]

ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో పవన్ కల్యాణ్ …

ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో పవన్ కల్యాణ్  బస చేశారు. ఆయన ‘గోపాల గోపాల’ సినిమా షూటింగు కోసం కాశీ పట్టణంలో వున్నాడు. ఆయనపై ఓ ప్రత్యేకమైన పాటను అక్కడ చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్, పవన్ కలసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

పవన్ కళ్యాణ్ పరామర్శించిన వీరా అభిమాని శ్రీజ కోలుకుందనే విషయాన్ని వైద్యులు వెల్లడించారు

  పవన్‌ను చూడాలన్న తన కుమార్తె కోరికను చిన్నారి తండ్రి మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తికి పవన్ స్పందించారు. అక్టోబర్ 17న ఖమ్మం వచ్చి శ్రీజను చూశారు. కోలుకున్నాక మరోసారి వచ్చి చూస్తానన్నారు. కాగా, ప్రస్తుతం శ్రీజ కోలుకుంది. తన బిడ్డకు మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లకు, పవన్‌కు శ్రీజ తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో శ్రీజను త్వరలో పవణ్ కళ్యాన్ మళ్లీ పరామర్శిస్తారని తెలుస్తోంది.

తాడేపల్లిలో పవన్ కళ్యాణ్ విగ్రహం

పవన్ మీద అభిమానం హద్దులు దాటిపోవడంతో అక్కడి అభిమానులు కొందరు పవర్ స్టార్ కోసం గుడి కట్టేశారు. ఆయన విగ్రహాన్ని అందులో పెట్టేశారు. జనసేన పార్టీ పెట్టిన సందర్భంలో స్పీచ్ ఇచ్చినప్పటి అవతారంలో పవన్‌ విగ్రహాన్ని తయారు చేసిన అభిమానులు.. త్వరలోనే దాన్ని ఆవిష్కరించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలలోని పెనుమంట్ర మండలం తాడేపల్లి రహదారిపై హీరో పవన్‌కళ్యాణ్‌ విగ్రహం ఏర్పాటైంది. రూ.2 లక్షల వ్యయంతో పవన్‌ విగ్రహాన్ని తయారు చేశారు. ఇప్పటిదాకా నటులకు గుళ్లు కట్టడం, విగ్రహాలు పెట్టడం […]

పవన్ ఎంట్రీ షాట్ ఖర్చు రూ. 50 లక్షలు… ‘గోపాల గోపాల’

గోపాల గోపాల చిత్రంలో విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ కోసం సుమారు 50 లక్షలతో విజువల్ వండర్‌ని క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విజువల్ ను పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కన్పించేటపుడు ఉపయోగిస్తారని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కి పీవీ సింధూ చాలెంజ్

స్వచ్ఛ భారత్ అభియాన్ లో పాల్పంచుకోవాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ ఆహ్వానించింది. హైదరాబాద్ స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న సందర్భంగా సింధూ ఈ మేరకు ప్రకటన చేసింది. సింధూ ఈ సందర్భంగా తొమ్మిది మంది ప్రముఖుల పేర్లను ప్రస్తావించేందుకు బదులుగా, ముగ్గురు పేర్లను మాత్రమే ప్రకటించారు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. మరి పవర్ స్టార్ ఎప్పడు చీపురు పడతారో చూద్దాం.

Page 2 of 212