పవన్ ఎంట్రీ షాట్ ఖర్చు రూ. 50 లక్షలు… ‘గోపాల గోపాల’
గోపాల గోపాల చిత్రంలో విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ కోసం సుమారు 50 లక్షలతో విజువల్ వండర్‌ని క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విజువల్ ను పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కన్పించేటపుడు ఉపయోగిస్తారని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.