నందమూరి బాలకృష్ణ సంక్రాంతి వేడుకలను నిమ్మకూరులో..

నందమూరి అందగాడు.. హిందూపురం ఎమ్మెల్యే.. బాలకృష్ణ  నిమ్మకూరులో.. సంక్రాంతి వేడుకలను ఆనందంగా జరుపుకొన్నారు. గ్రామస్థులు, అభిమానులతో కలిసి సరదాగా గడిపారు. బుధవారం ఆయన ఊరిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గోదాదేవి కల్యాణవేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినా.. తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒక్కటేనని ఆయన అన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు, విదేశాల్లో ఉన్న తెలుగవారికి ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

బాలకృష్ణ…సత్యదేవ్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల…..

బాలకృష్ణ , సత్యదేవ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం పత్రికల వారికి విడుదల చేశారు. కళ్లజోడు, గళ్ల లుంగీతో ఉన్నారు ఈ ఫస్ట్‌లుక్‌లో బాలయ్య. మాస్‌ని లక్ష్యంగా చేసుకొని ఈ చిత్రం రూపొందుతోందని ఈ ఫస్ట్‌లుక్ చెప్పకనే చెబుతోంది. ఇందులో బాలకృష్ణ సీబీఐ ఆధికారిగా నటిస్తున్నారు. 60 శాతం షూటింగ్‌తో పాటు మూడు పాటల చిత్రీకరణ కూడా ఈ చిత్రం పూర్తి చేసుకుంది. బాలకృష్ణకు జోడీగా త్రిష నటిస్తున్నారు. ‘లెజెండ్’ […]