వీల్ చైర్ కే పరిమితమయ్యే పాత్రలో నాగర్జున
కార్తీ, టాలీవుడ్ స్టార్ నాగార్జున హీరోలుగా తమిళం, తెలుగులో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో నిర్మాణం కానున్నఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ నాగార్జున మునుపెన్నడూ చేయని పాత్రను చేయడానికి సిద్ధమయ్యారు. పక్షవాతానికి గురైన ఓ వ్యాధిగ్రస్తుడు వీల్ చైర్ కే పరిమితమయ్యే పాత్ర. ఇందులో నాగార్జున ఈ తరహా వైవిధ్యమైన ఈ పాత్రలో నటిస్తుంటే.. అతని ఆలనా పాలనా చూసే పాత్రలో కార్తీ నటిస్తున్నారు.