స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న సినీ హీరో అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పిలుపు మేరకు సినీ హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల,నాగచైతన్య, అఖిల్, సుశాంత్ బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో చీపుర్లు చేతపట్టి చెత్తను, రోడ్లను పేరుకుపోయిన మట్టిని కూడా తొలగించి శుభ్రం చేశారు. స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా ఆయన కు అభినందనలు తెలిపారు.