“బాబూ.. నా పర్సు పోయింది….
బస్సు వెళ్తోంది. హఠాత్తుగా సుబ్బారావు కేకపెట్టాడు. “బాబూ.. నా పర్సు పోయింది. దాన్లో పదివేల రూపాయలున్నాయి. నా పర్సు నాకిస్తే వారికి వంద రూపాయలిస్తాను” ఏడుస్తూ అన్నాడు. “నాకిస్తే ఐదొందలిస్తాను” మరో వ్యక్తి అరిచాడు. “నాకిస్తే వెయ్యి” “నాకిస్తే రెండు వేలు…” “నాకిస్తే నాలుగు వేలు…” “అసలెవ్వరికీ ఇవ్వకుంటే మొత్తం నావేగా” అన్నాడొక ప్రయాణీకుడు నాలుక కరుచుకుంటూ.