Music-Director-Chakri-passed-away

సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో పెద్ద విషాదం. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం చెందారు. 40 ఏళ్ల చక్రి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్ను మూశారు. రాత్రి ఆయనకు గుండె పోటు రాగా.. అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు చక్రి. చక్రి పూర్తి పేరు చక్రధర్ గిల్లా. 1974 జూన్ 15న వరంగల్ జిల్లా మహబూబాబాద్‌ మండలం కంభాలపల్లిలో జన్మించారు.