Music Director AR Rehaman

లఘు చిత్రంలో రహమాన్….

రెండు ఆస్కార్ అవార్డులతో ప్రపంచవ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న సంగీతదర్శకుడు ఎ.ఆర్. రహమాన్ జీవితం చాలామందికి ఆదర్శం అనే చెప్పాలి. అందుకే ఆయన జీవిత చరిత్రను లఘు చిత్రంగా దర్శకుడు ఉమేష్ అగర్వాల్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి ‘జైహో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ నెల 25న న్యూయార్క్‌లోని ‘మ్యూజియమ్ ఆఫ్ మూవింగ్ ఇమేజ్’లో  ఈ చిత్రాన్ని ప్రద ర్శించనున్నారు.