ప్రముఖ హాస్య నటుడు ఎం.ఎస్.నారాయణ క్షేమం..
ప్రముఖ హాస్యనటుడు ఎం.ఎస్.నారాయణ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సోషల్ నెట్‌వర్క్‌ల్లో, మీడియాలో చనిపోయారనే వార్త హల్‌చల్ చేస్తోంది. ఆయన మరణించారని వస్తున్న వార్తలను ఆయన కుమారుడు ఖండించారు. కానీ నిజానికి ఆయన క్షేమంగా ఉన్నట్లు ఆయన కొడుకు విక్రమ్ వెల్లడించారు. ఎ.ఎస్.నారాయణగారు ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.