30 ఏళ్లుగా తలదాచుకుంటున్న ఇళ్లు కళ్లెదుటే నేలమట్టమయ్యాయి
30 ఏళ్లుగా తలదాచుకుంటున్న ఇళ్లు కళ్లెదుటే నేలమట్టమయ్యాయి. పదేళ్ల క్రితం ఇళ్ల పట్టాలు పొందినా.. పార్కు స్థలం కావడంతో అధికార యంత్రాంగం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం కూల్చివేసింది. కాళ్లావేళ్లా పడినా.. కన్నీళ్లు పెట్టుకున్నా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా ఫలితం లేకపోయింది. గూడు చెదిరిన బడుగు జీవులకు వైఎస్‌ఆర్‌సీపీ పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అండగా నిలిచారు. బాధితులను ఓదారుస్తూ.. అధికారులతో చర్చిస్తూ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. కల్లూరు: వారంతా నిరుపేదలు. రెక్కాడితేనే డొక్కాడుతోంది. […]