Inter

ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 11 నుంచి 31వరకు

మార్చి 11 నుంచి 31వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు 9,90,912 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ కేటగిరిలో 9,33,308 మంది, ఒకేషనల్‌లో 57,604 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. దీని కోసం ఇంటర్మీడియెట్ విద్యా బోర్డు 1,411 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మార్చి 3 వరకు జరగుతాయి. ఈ పరీక్షలకు 2,90,380 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. దీని కోసం 1,723 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.