India qualified the hockey finals

2002 క్రీడల్లో తుది పోరుకు అర్హత సాధించిన భారత్‌.. మళ్లీ ఇప్పుడు ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది.

 ఈ ఆసియాడ్‌లో భారత జట్టు స్వర్ణం నెగ్గితే.. 2016 రియో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. మంగళవారం జరిగిన సెమీస్‌ పోరులో భారత్‌ 1-0తో దక్షిణ కొరియాను ఓడించింది. భారత పురుషుల హాకీ జట్టు 12 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల ఫైనల్‌ చేరింది. గురువారం జరగబోయే పసిడి పోరులో భారత్‌.. చిరకాల ప్రత్యర్థి, డిఫెండింగ్‌ చాంప్‌ పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆట ఆరంభం నుంచే భారత్‌ ఆధిక్యం ప్రదర్శించింది. కానీ తొలి రెండు క్వార్టర్స్‌లో సువర్ణావకాశాలను […]