Electric indoor substations construction

ఆదోనిలో రూ.2.5 కోట్లతో విద్యుత్‌ ఇండోర్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం

హైదరాబాద్‌, బెంగళూరు వంటి మహానగరాల్లో విద్యుత్‌ వినియోగదారులకు ఎలాంటి పొదుపు, నాణ్యత గల విద్యుత్‌ ఇండోర్‌ సబ్‌స్టేషన్లను ఉన్నాయో అలాంటి ఇండోర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఆదోనిలో కూడా నిర్మిస్తున్నారు. దీనిని ఈ నెలాఖరులోపు ప్రారంభించాలని ట్రాన్స్‌కో అధికారులు పనులు వేగవంతంగా చేపడుతున్నారు. రాయలసీమ జిల్లాలోనే ఇది తొలి ఇండోర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషనని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. రెండోవ  విడతలో కర్నూలు, నంద్యాలలో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు.