Chiranjeevi says about the Ramalingayya

రామలింగయ్య జయంతి సందర్బంగా చిరంజీవి గారు ఆయన గురించి చెప్పిన విషయాలు.

అందరికీ బయటికి కనిపించే మామూలు హాస్యనటుడు కాదాయన. ఆయనలో ఫిలసాఫికల్‌ ఔట్‌లుక్‌ ఉంటుంది. ఆయన వేదాంత ధోరణి చాలా గొప్పది. మానవతా విలువలున్న మనిషి. హోమియోపతి డాక్టర్‌. స్వాతంత్య్ర సమరయోధుడు, జీవితాన్ని కాచి వడబోసిన నిష్ణాతుడు. ఆయన ప్రతి మాటా విజ్ఞాన గుళికలాగా అనిపిస్తుంది. వివేకానంద, రామకృష్ణపరమహంసకు సంబంధించి చాలా విషయాలను చెప్పేవారు. ఆయనతో కూర్చుంటే ఆనందంగా ఉండేది. అల్లుడిగా కన్నా బిడ్డలాగానే చూసుకునేవారు. గురుశిష్యుల అనుబంధం మా ఇద్దరిది. జీవితంలో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి […]