ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.850 కోట్ల నిధులు!
అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కరుణ చూపింది. ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద భారీ మొత్తంలో నిధులను మంజూరు చేసింది. ముఖ్యంగా.. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 జిల్లాల అభివృద్ధికి కేంద్ర ఆర్థిక శాఖ 350 కోట్ల రూపాయలు విడుదల చేయాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా 2014-2015 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను పారిశ్రామిక ప్రోత్సాహకాలకు […]