“Chandra kala”

హన్సిక ప్రధాన పాత్ర పోషించిన ‘చంద్రకళ’ డిసెంబర్‌ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది

హన్సిక ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం‘అరన్మణి’ తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం గురించి నిర్మాత కల్యాణ్‌ మాట్లాడుతూ గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఉంటూ హారర్‌ టచ్‌తో చాలా థ్రిల్లింగ్‌గా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘చంద్రకళ’ డిసెంబర్‌ మొదటివారంలో ఆడియో, అదే నెల మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే‘తమిళనాడులో రూ. 24 కోట్లకు పైగా వసూలు చేసి సంచలన విజయం సాధించిన ‘అరన్మణి’ తెలుగులో కూడా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకంతో రిలీజ్‌ చేస్తున్నాం.