Chakri

చక్రిని నువ్వే చంపావంటూ చక్రి భార్య శ్రావణికి వేధింపులు….

చక్రిని నువ్వే చంపావంటూ అత్త, మామలు తనను మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు… దివంగత సంగీత దర్శకుడు చక్రి అక్కా, చెల్లెళ్ళు తనను వేధిస్తున్నారని ఆయన భార్య శ్రావణి మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. అందులో తెలిపిన వివరాల ప్రకారం చక్రి, శ్రావణిల ప్రేమ వివాహం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. అత్తింటి వారు ఇప్పుడిప్పడే దగ్గరవుతున్నారు. నెల రోజుల క్రితం అత్త, మరిది వేరుగా వెళ్ళి పోయారు. చక్రి మరణాంతరం వాళ్ళంతా ఇంట్లోనే కలిసి ఉంటున్నారు. […]

సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో పెద్ద విషాదం. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం చెందారు. 40 ఏళ్ల చక్రి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్ను మూశారు. రాత్రి ఆయనకు గుండె పోటు రాగా.. అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు చక్రి. చక్రి పూర్తి పేరు చక్రధర్ గిల్లా. 1974 జూన్ 15న వరంగల్ జిల్లా మహబూబాబాద్‌ మండలం కంభాలపల్లిలో జన్మించారు.