Centenary Award Coming on superstar

సూపర్‌స్టార్‌కు సెంటినరీ అవార్డు వరించనుంది

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ను మరో అరుదైన అవార్డు వరించనుంది. భారత ప్రభుత్వం ఈ దక్షిణాది సూపర్‌స్టార్‌కు సెంటినరీ (ఈఏడాది ప్రముఖ సినీ కళాకారుడు) అవార్డును ప్రకటించింది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఈ సెంటినరీ అవార్డు ఆయన పుట్టిన రోజు కానుకగా పేర్కొనవచ్చు. డిసెంబర్ 12న 64వ వసంతంలోకి అడిగిడుతున్న రజనీ నటుడిగా నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ 40 ఏళ్లలో ఆయనకు ఎన్నో అవార్డులు, బిరుదులు వచ్చాయి.