BJP

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్…. ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ……

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్…. ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ…… ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ శనివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆమె నీతి బాగ్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ చేరే అవకాశం

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ చేరే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే జోరుగా బీజేపీ కేంద్ర నాయకులతోను, రాష్ట్రస్థాయి నాయకులతోను చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ఇక ఎన్డీయేలోకి టీఆర్ఎస్ చేరడం ఖాయమని అంటున్నారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఇప్పటికే జోరుగా హస్తిన పర్యటనలు చేస్తున్నారు. మొదట్లో కొన్నాళ్ల పాటు మైనారిటీలను దృష్టిలో పెట్టుకుని కొంత ముందు వెనక ఆలోచించినా ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు, […]

బీజేపీలో చేరడం లేదు…-గంగూలీ

బీజేపీలో చేరడం లేదు… -గంగూలీ భారత క్రికెట్ ఆటగాడు గంగూలీ బీజేపీలో చేరబోతున్నారంటూ ఇటీవల వార్తలు జోరందుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా దీనిపై స్పందించమని అడిగిన మీడియాకు గంగూలీ సమాధానం ఇచ్చారు. గంగూలీ మాట్లాడుతూ ‘అవును.. పార్టీలో చేరేందుకు భాజపా నాకు అవకాశమిచ్చింది. కానీ దాన్ని నేను తిరస్కరించారు. ఎన్నికల్లో అస్సలు పోటీ చెయ్యను’ అని స్పష్టం చేశారు.  

జార్ఖండ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ఠ్రాలలో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న సందర్భంగా….

మంగళవారం జార్ఖండ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ఠ్రాలలో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కార్యాలయం వద్ద బాణసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ భారత్‌ను ప్రపంచంలో ఆగ్రదేశంగా తీర్చి దిద్దేందుకు ఆహర్నిశ లు కృషి చేస్తున్నారని శాసనసభా పక్ష నేత డాక్టర్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నారు.