Bengal Tiger

సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందే చిత్రంకు ‘బెంగాల్ టైగర్’అనే టైటిల్ ను రవితేజ ఒకే చేశారు

‘బలుపు’, ‘పవర్’ చిత్రాలతో జోరుమీదున్న రవితేజ ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘కిక్-2’ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం తరువాత ఆయన సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ‘బెంగాల్ టైగర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఈ కథకు సరిగ్గా సూట్ అవుతుందని దర్శకుడు సూచించడంతో ఈ రవితేజ టైటిల్ ను ఒకే చేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనుంది.