barack obama

అమెరికా అధ్యక్షుడు ఒబామా దంపతులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక విందు …..

అమెరికా అధ్యక్షుడు ఒబామా దంపతులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ  ప్రత్యేక విందు ….. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన విందు కార్యక్రమానికి  ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు  సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాలతో రాష్ట్రపతిభవన్‌ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. విందుకు […]

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు భారతదేశ పర్యటన…..

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు భారతదేశ పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ల్యాండయింది. ఆయనకు స్వాగతం పలికేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు ఎర్రటి శాలువా కప్పుకొని వచ్చారు. ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకొచ్చారు. ఆ వెంటే ఒబామా భద్రతాధికారుల వాహనం కూడా ఉంది.

అమెరికా అధ్యక్షుడు ఒబామా కోసం ఆగ్రాలో భారీ భద్రత

తాజ్‌మహల్ సందర్శనకు ఈ నెల 27న వస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా కోసం ఆగ్రాలో భారీ భద్రత ఏర్పాటుచేశారు. వంద మంది అమెరికా భద్రతాధికారులతోపాటు నాలుగు వేల మంది భారత బలగాలు ఒబామాకు రక్షణగా నిలువనున్నాయి. భద్రతా ఏర్పాట్లకు తుదిరూపు ఇచ్చేందుకు నాలుగువేల మంది స్థానిక పోలీసులు, పారామిలిటరీ బలగాలు, వందమంది అమెరికా భద్రతాధికారులతో పటిష్ఠమైన భద్రత ఏర్పాటుచేస్తున్నాం అని ఎస్‌ఎస్‌పీ ఆగ్రా రాకేశ్ మోదక్ తెలిపారు. భద్రతా కారణాలతోపాటు దృష్టి మరల్చడానికి జరిగే దాడులను నివారించడానికి […]

గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చే ఏడాది భారత గణతంత్ర వేడుకలకు హాజరుకానున్నారు. అమెరికా అధ్యక్షుడు మన దేశ గణతంత్ర వేడుకలకు హాజరుకానుండటం ఇదే తొలిసారి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని ఒబామా శుక్రవారం అంగీకరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు 2015 జనవరిలో ఒబామా భారత్‌లో పర్యటించి గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారని అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమాచార కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. భారత […]