‘బాహుబలి’ పాటలను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు…
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు రాజవౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘బాహుబలి’ దాదాపు చివరి దశకు చేరుకుంది వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకవైపు షూటింగ్ జరుగుతుండగా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్‌కూడా జరుపుకుంటుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిస్తున్న పాటల రికార్డింగ్ కూడా పూర్తయినట్టు తెలిసింది.