Aishwarya rai

మాజీ మిస్‌ వరల్డ్‌ అందాల రాశి ఐశ్వర్యరాయ్‌కి లండన్‌లో ఘన సత్కారం జరిగింది…..

తన తల్లి బ్రింద్య రాయ్, భర్త అభిషేక్‌ బచ్చన్‌తో పాటు కూతురు ఆరాధ్యతో ఈమె స్టేజీపై సందడి చేసింది. తనకు జరిగిన సత్కారానికి ఐశ్వర్య మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపింది. 1994లో ఐశ్వర్యకు మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ లభించి 20 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ మిస్‌ వరల్డ్‌గా ఈమెను పరిగణిస్తూ..‘ బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ ’ అంటూ మిస్‌వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ ప్రకటించింది.

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ 

కరణ్ జోహార్ దర్శకత్వంలో ఆమె మళ్లీ వెండితెర కు ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ ఇవ్వబతున్నారు. సినిమాకు ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే టైటిల్ ఖరారు చేసారు ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, అనుష్క శర్మ కూడా నటించనున్నారు. వచ్చే ఏడాది జూన్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఐశ్వర్యరాయ్ మళ్లీ వెండి తెరపై మెరవడానికి సిద్దంగా ఉండటంతో ఆమె ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. […]