ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యన్ జన్మదినం
కొణిదెల కల్యాణ్ బాబు ప్రముఖ తెలుగు సినీనటుడు ఆయన సెప్టెంబరు 2, 1973న కొణిదెల వెంకటరావు, అంజనా దేవిలకు జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. ప్రముఖ నటుడు మెగాస్టార్ గా ప్రసిద్ది చెందిన చిరంజీవి (శివ శంకర వర ప్రసాద్) పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు మరియు నిర్మాత అయిన నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య. కళ్యాణ బాబు 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇతనికి మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది. 28 జనవరి 2009 న నటిగా మారిన మోడల్ రేణూ దేశాయ్ ని వివాహం చేసుకున్నాడు.వీరికి కలిగిన కుమారుని పేరు అకీరా నందన్.