a nuisance in kurnool city

కర్నూలు నగరంలో పిచ్చికుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి.

  శ్రీలక్ష్మీనగర్‌, మాధవనగర్‌, బి.క్యాంపు , అరోరా నగర్‌ ప్రాంతాల్లో పిచ్చికుక్కలు కరవడంతో 20 మంది తీవ్రంగా గాయపడ్దారు. ఆయా కాలనీ వాళ్ళు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే బెంబేలెత్తుతున్నారు. ఈ విషయం మున్సిపల్‌ ఆరోగ్య అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పిచ్చికుక్కలు, వీధి కుక్కల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.