2nd innings

మళ్లీ కెమేరా ముందుకు… రానున్న జ్యోతిక

చాలా విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో జ్యోతిక మళ్లీ నటిగా మేకప్ వేసుకున్నారు. సూర్యను పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లయిన జ్యోతిక ఇంతకాలం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. పిల్లలు కొంచెం పెద్దవాళ్లు కావడంతో మళ్లీ ఇప్పుడు నటించాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై స్వయంగా సూర్య నిర్మిస్తున్నారు .