ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.850 కోట్ల నిధులు!

కలకండతో స్వైన్ ఫ్లూ లక్షణాలు దగ్గు, జలుబు మటుమాయం…!
కర్నూలు జిల్లావాసులకు కొత్త అవతారంలో పవన్…!

NCBN-Modi---05.02.2015అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కరుణ చూపింది. ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద భారీ మొత్తంలో నిధులను మంజూరు చేసింది. ముఖ్యంగా.. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 జిల్లాల అభివృద్ధికి కేంద్ర ఆర్థిక శాఖ 350 కోట్ల రూపాయలు విడుదల చేయాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా 2014-2015 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను పారిశ్రామిక ప్రోత్సాహకాలకు వినియోగించనుంది. అలాగే, అనేక శాఖల్లో పన్ను రాయితీలను కూడా కల్పించనుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సాయంగా 500 కోట్ల రూపాయలను విడుదల చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల్లో పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 850 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందనుంది. ఆర్థిక శాఖ తాజా ఆదేశాలు ఏపీ సర్కారుకు ఊరటనివ్వనున్నాయి.

కలకండతో స్వైన్ ఫ్లూ లక్షణాలు దగ్గు, జలుబు మటుమాయం…!
కర్నూలు జిల్లావాసులకు కొత్త అవతారంలో పవన్…!

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *