భక్తిరస చిత్రాల హీరోగా పేరుగాంచిన యువ సామ్రాట్ నాగార్జున మరో ఆధ్యాత్మిక చిత్రంలో…..

ప్రభుత్వ ప్రి మెట్రిక్ మైనారిటి బాలికల వసతి గ్రుహమును సందర్సించిన మైనారిటి సంక్శేమాధికారి శ్రీ యస్. మస్తాన్ వలి
భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు……

nagarjuna-bhai300భక్తిరస చిత్రాల హీరోగా పేరుగాంచిన యువ సామ్రాట్ నాగార్జున మరో ఆధ్యాత్మిక చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి ఏడుకొండలవాడు అనే పేరును నామకరణం చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. గతంలో అన్నమయ్య. శ్రీరామదాసు, షిరిడీసాయి వంటి చిత్రాల్లో నటించిన నాగార్జున మంచి పేరుతో పాటు ప్రశంసలు కూడా అందుకున్న విషయం తెల్సిందే.
ఇపుడు ఏకంగా తిరుమల వేంకటేశుడి పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నారు. గతంలో జనరంజకమైన ఆధ్యాత్మిక కథా చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు ఇప్పుడీ చిత్రాన్ని రూపొందించడానికి సమాయత్తమవుతున్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. అన్నమయ్యగా ప్రేక్షకుల నీరాజనాలందుకున్న నాగార్జున, ఏడుకొండల వాడిగా ఎలా ఆకట్టుకుంటాడన్నది ఆసక్తికరం!
ప్రభుత్వ ప్రి మెట్రిక్ మైనారిటి బాలికల వసతి గ్రుహమును సందర్సించిన మైనారిటి సంక్శేమాధికారి శ్రీ యస్. మస్తాన్ వలి
భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు……

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *