మా టీవీని అమ్మేశారు
అక్కినేని నాగార్జున – అల్లు అరవింద్ – నిమ్మగడ్డ ప్రసాద్ ల నిర్మాణ సారధ్యంలో తెలుగులో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న పాపులర్ టీవీ చానల్ మా టీవీ ని ఇండియాలోనే బాగా ఫేమస్ అయిన స్టార్ ఇండియా వారు మా టెలివిజన్ నెట్వర్క్ బ్రాడ్ కాస్టింగ్ ని కొనుకున్నారు. దీంతో టెలివిజన్ మార్కెట్ లోకి ఎంతో మందికి అవకాశాలు ఇవ్వడానికి అవకాశం కల్పించనున్నారు.
ఈ విషయం పైన ఈ రోజు నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ మరియు స్టార్ ఇండియా ప్రతినిధులు కలిసి మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్నీ తెలియజేశారు. ఇండియాలోనే స్టార్ ఇండియా వారు ఎంటర్టైన్మెంట్ బిజినెస్ లో రెండవ స్థానంలో ఉన్నారు. అలాంటి వారికి మా టీవీ నెట్వర్క్ బ్రాడ్ కాస్టింగ్ ని అప్పగించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.