‘కార్తికేయ’ చిత్రం హిందీలోనూ రీమేక్ హక్కుల కోసం ఎగబడుతున్నారట!

Comedian M. S. Narayana is No More !
ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 11 నుంచి 31వరకు

Karthikeya-23.01నిఖిల్ – స్వాతి జంటగా నటించిన ‘కార్తికేయ’ చిత్రం ఎంత భారీ హిట్ సాధించిందో అందరికీ విదితమే! అతి తక్కువ బడ్జెట్’లో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా 14 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న వెంటనే తమిళ నిర్మాతలు హక్కులను సొంతం చేసుకోవడం కోసం క్యూ కట్టారు. కానీ.. ఈ మూవీని నిర్మించిన నిర్మాత శ్రీనివాస రావు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ రైట్స్ అమ్మనంటూ తేల్చి చెప్పడంతోబాటు.. డబ్బింగ్ చేసి విడుదల చేసుకుంటానని అనడంతో వెనక్కు తగ్గారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేశారు కానీ.. రిలీజ్ తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఇదిలావుండగా.. ఇప్పుడు తాజాగా ఇటీవలే ఈ మూవీని తిలకించిన బాలీవుడ్ నిర్మాతలు.. హిందీలోనూ రీమేక్ చేయడానికి హక్కుల కోసం ఎగబడుతున్నారట! ముఖ్యంగా ఏక్తాకపూర్ లాంటి అగ్రనిర్మాత, అగ్నిహోత్రి నిర్మాతకు కాంటాక్టులో వుండి మరీ చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఏదైతేనేం.. ‘కార్తికేయ’తో చిత్రంతో నిర్మాతకు కాసులవర్షం బాగానే కురుస్తోంది.

Comedian M. S. Narayana is No More !
ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 11 నుంచి 31వరకు

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *