ప్రముఖ కామెడీ యాక్టర్ ఎమ్మెస్ నారాయణ కన్నుమూశారు….

సూర్య పేరుతో నకిలీ ఫేస్‌బుక్………
700 థియేటర్లలో కళ్యాణ్ రామ్ ‘పటాస్’ రిలీజ్!

ms-narayana1421291006ప్రముఖ కామెడీ యాక్టర్ ఎమ్మెస్ నారాయణ కన్నుమూశారు….

కొండాపూర్ లోని కిమ్స్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు కొల్పోయారు. 1951 ఏప్రిల్ 16న జన్మించారు ఎమ్మెస్. తాగుబోతు కేరక్టర్లలో నటించడంలో ఎమ్మెస్ నారాయణ దిట్ట. సంక్రాంతికి సొంత ఊరికెళ్లిన ఎమ్మెస్ అక్కడ ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి భీమవరం, విజయవాడ, హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. దాదాపు 700 పైగా సినిమాల్లో నటించారు. 5 నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. మా నాన్నకు పెళ్లి మూవీతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. లెక్చరర్ గా జీవితాన్ని ప్రారంభించారు. కొన్ని సినిమాలకు డైరెక్షన్ కూడా చేశారు. మరి కొన్ని సినిమాలకు రైటర్ గా కూడా పనిచేశారు. ఆయనకు కొడుకు, కూతురు ఉన్నారు. పిల్ల జమిందార్ మూవీలో లెక్చరర్ కేరక్టర్ కు మంచి గుర్తింపు లభించింది.

ఆయన అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో రేపు ఉదయం జరుపనున్నట్లు ఆయన కుమారుడు చెప్పారు. ఎంఎస్‌ మృతదేహాన్ని ఈ రోజు మధ్నాహ్నం ప్రజల సందర్శనార్థం ఫిలింనగర్‌లోని ఫిలింఛాంబర్‌లో ఉంచుతారు.

సూర్య పేరుతో నకిలీ ఫేస్‌బుక్………
700 థియేటర్లలో కళ్యాణ్ రామ్ ‘పటాస్’ రిలీజ్!

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *