భారత దేశ 66వ గణతంత్ర వేడుకలు……

భక్తిరస చిత్రాల హీరోగా పేరుగాంచిన యువ సామ్రాట్ నాగార్జున మరో ఆధ్యాత్మిక చిత్రంలో…..
జిల్లా లో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు

10927163_618797098220275_7615834622576543974_oభారత దేశ 66వ గణతంత్ర వేడుకలు సోమవారం దేశమంతటా ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ఒకరు ఈ గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావడం ఇదే ప్రథమం. యూనిఫారం దుస్తుల్లో సైనికుల కవాతు, భారత సైనిక పాటవాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటి చెప్పే శకటాల ప్రదర్శన, సన్నని చినుకులతోపాటు గగనతలం నుంచి హెలికాప్టర్‌లో కురిసిన పూలజల్లులు,వాయిద్య బృందాలు, నృత్య కళా రూపాలు పరేడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వైమానిక దళ విన్యాసాలు సందర్శకులను మంత్రముగ్డులను గావించాయి. సైనిక పాటవంకన్నా సాంస్కృతిక వైవిధ్యానికి ఈ పరేడ్‌లో పెద్దపీట వేశారు. త్రివిధ దళాలకు చెందిన మహిళా విభాగాలు చేసిన విన్యాసాలు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి.

గణతంత్ర దినోత్సవ ముఖ్యఅతిధి ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ‘ది బీస్ట్‌’ వాహనంలో రాజ్‌పథ్‌కు వచ్చారు. అంతకుముందే అక్కడికి చేరుకున్న ప్రధాని మోడీ ఒబామా దంపతులను వేదికపైకి సాదరంగా తోడ్కొని వెళ్లారు. జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆవిష్కరించారు. 

అనంతరం సాయుధ దళాలు సమర్పించిన గౌరవ వందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు.

భక్తిరస చిత్రాల హీరోగా పేరుగాంచిన యువ సామ్రాట్ నాగార్జున మరో ఆధ్యాత్మిక చిత్రంలో…..
జిల్లా లో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *