taurine side effects


వాట్స్యాప్ వినియోగానికి ఏడాదికి రూ.60 చార్జ్

Happy Birth Day to Virat Kohli
పవన్ కళ్యాణ్ కి పీవీ సింధూ చాలెంజ్

Whatsappa-05.11అత్యంత ప్రచారం పొందిన మొబైల్‌ మెసేజింగ్‌ సర్వీస్‌ వాట్స్‌యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది వినియోగిస్తున్నారు. దీనికి భారత్‌లో 7 కోట్ల మంది వినియోగదారులున్నారు. ఈ కంపెనీని ఫేస్‌బుక్‌ 1,900 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.1,14,000 కోట్లకు) కొనుగోలు చేసింది. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి వాట్స్‌యాప్‌ను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేయడంలో కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ (వ్యాపారాభివృద్ధి) నీరజ్‌ అరోరా కీలకపాత్ర పోషించారు..వాట్స్‌యాప్‌ మంచినీళ్లు, విద్యుత్‌ వంటి యుటిలిటీ సేవ. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించడానికి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని అనుసరిస్తున్నాం. కొంతకాలం తర్వాతైనా చందా విధానాన్ని అమలు చేస్తాం. ఏడాదికి దాదాపు రూ.60 చందా చెల్లించడం సమస్య కాదు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించడానికి ఎంత చేయాలో అంత చేస్తాం.కంపెనీ పెట్టినప్పుడు మొదటి వాడకందారుడ్ని పొందడానికి వాట్స్‌యాప్‌ చాలా కష్టపడింది. వాడకందార్లను పెంచుకోవడానికి మొదటి నుంచి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నది కంపెనీ వ్యూహం. ఇప్పటికీ మాకు రోజుకు 50 వేల ఇ-మెయిళ్లు వస్తాయి. అన్నింటికీ సమాధానం చెబుతాం. ప్రస్తుతం ఉన్న వాడకందార్లను సంతృప్తిపరిస్తే.. కొత్తవారు పెరుగుతారు. స్మార్ట్‌ ఫోన్లను వినియోగించే ప్రతి ఒక్కరు మా లక్ష్యమే. వినియోగదారులకు మరిన్ని సేవలందించడానికి ఇన్నోవేషన్లను తీసుకురావడానికి మా వద్ద తగినన్ని నిధులు ఉన్నాయి.

Happy Birth Day to Virat Kohli
పవన్ కళ్యాణ్ కి పీవీ సింధూ చాలెంజ్

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *