Upcoming Movies

‘పీకే’ నట బృందం మంగళవారం హైదరాబాద్‑లో సందడి…..

‘పీకే’ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది సినిమా ప్రమోషన్‑లో భాగంగా త్వరలో విడుదలకానున్న బాలీవుడ్ చిత్రం ‘పీకే’ నట బృందం మంగళవారం హైదరాబాద్‑లో సందడి చేసింది.అమీర్ వాడిన ట్రాన్సిస్టర్ ను వేలం వేయనున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇందులో నటించిన హీరో అమీర్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ, దర్శకుడు రాజ్‑కుమార్ హిరానీ తదితరులు వచ్చారు.

చిన్నారి పెళ్లికూతురిలా బుల్లితెర నుండి ‘ఉయ్యాల జంపాల’ వెండితెరపైకి వచ్చిన చిన్నది అవికగోర్‌.

  ‘లక్షీరావే మా ఇంటికి’ సినిమాలో ఆమె నటనతో సగటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అవికగోర్‌ మాట్లాడుతూ..మోడ్రన్‌ దుస్తులు నాకు ఇష్టముండదు. ప్రేక్షకులు కూడా నన్ను వాళ్ల ఇంట్లో అమ్మాయిల అనుకుంటున్నారు . టాలీవుడ్‌లో నేను నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తానని సౌకర్యంగా ఫీలవని పాత్ర అబితాబ్‌ బచ్చన్‌తోనైనా..పవన్‌ కళ్యాణ్‌తో అయినా చేయను అని తేల్చి చెప్పేసింది.

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నఅభిమానులకు….

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులు రోజుకో వార్త వింటున్నారు. …గతంలో చిరంజీవితో ఎన్నో హిట్‌ సినిమాలు చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు  దర్శకత్వం  లో సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు సమచారం. గతంలో వీరిద్దరి మధ్య ‘‘ జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు ’’ వంటి హిట్‌ సినిమాలు ఉన్నాయి. యంగ్‌ హీరోతో సైతం ఆడియన్స్‌ని మెప్పించగల ఘనత ఉన్న రాఘవేంద్రరావు అయితే ఎంటర్‌టైనమెంట్‌తో పాటు […]

బాలకృష్ణ…సత్యదేవ్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల…..

బాలకృష్ణ , సత్యదేవ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం పత్రికల వారికి విడుదల చేశారు. కళ్లజోడు, గళ్ల లుంగీతో ఉన్నారు ఈ ఫస్ట్‌లుక్‌లో బాలయ్య. మాస్‌ని లక్ష్యంగా చేసుకొని ఈ చిత్రం రూపొందుతోందని ఈ ఫస్ట్‌లుక్ చెప్పకనే చెబుతోంది. ఇందులో బాలకృష్ణ సీబీఐ ఆధికారిగా నటిస్తున్నారు. 60 శాతం షూటింగ్‌తో పాటు మూడు పాటల చిత్రీకరణ కూడా ఈ చిత్రం పూర్తి చేసుకుంది. బాలకృష్ణకు జోడీగా త్రిష నటిస్తున్నారు. ‘లెజెండ్’ […]

అమర గాయకుడు ఘంటసాల జీవితకథతో ఓ టెలీ ఫిలిమ్ రూపొందనుంది.

అమర గాయకుడు ఘంటసాల జీవితకథతో ఓ టెలీ ఫిలిమ్ రూపొందనుంది. 555 పాటలతో 828 పేజీలతో ‘ఘంటసాల పాటశాల’ అనే అపురూప గ్రంథాన్ని తెలుగు పాఠకులకు అందించిన ఘంటసాల వీరాభిమాని సీహెచ్ రామారావు ఏడాది పాటు శ్రమించి, పరిశోధించి రాసిన ‘ఘంటసాల’ స్క్రిప్ట్ ఆధారంగా ఈ టెలీఫిలిమ్ రూపొందనుంది. సీనియర్ నిర్మాత కేవీవీ సత్యనారాయణ సమర్పణలో వేణు ఈ టెలీ ఫిలిమ్ నిర్మించనున్నారు. కర్రి బాలాజీ దర్శకుడు.

మదగజ ఘీంకారాలు, రథచక్రాల ధాటికి నలిగిపోతున్న అభాగ్యుల ఆర్తనాదాలు,తలపించే కథాంశంతో ‘బాహుబలి’

మదగజ ఘీంకారాలు, రథచక్రాల ధాటికి నలిగిపోతున్న అభాగ్యుల ఆర్తనాదాలు, గుర్రపు డెక్కల చప్పుళ్లు, కరవాల విన్యాసాలు, రాజకీయ యుక్తులు, మహాభారతాన్ని తలపించే కథాంశంతో, కురుక్షేత్రాన్ని గుర్తుకు తెచ్చే యుద్ధ విన్యాసాలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘బాహుబలి’ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. . ఈ షెడ్యూల్‌తో ‘బాహుబలి’ తుది దశకు చేరుతుంది. తెలుగు తెరపై ఓ మహాద్భుతాన్ని ఆవిష్కరింపజేసే సినిమా ఇదనీ, హాలీవుడ్ సినిమాను చూస్తున్న అనుభూతి ప్రేక్షకుల్లో కలగడం ఖాయమని చిత్ర బృందం […]

‘బాహుబలి’ పాటలను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు…

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు రాజవౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘బాహుబలి’ దాదాపు చివరి దశకు చేరుకుంది వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకవైపు షూటింగ్ జరుగుతుండగా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్‌కూడా జరుపుకుంటుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిస్తున్న పాటల రికార్డింగ్ కూడా పూర్తయినట్టు తెలిసింది.

అనుష్క ఓ పాత్ర కోసం తన బరువుని ఏకంగా వంద కిలోలకు పెంచనున్నారట.

పాత్ర కోసం శరీరాన్ని హింసించుకోవడం, కావాలని బరువు పెరగడం, ఊహించని స్థాయిలో బరువు తగ్గడం… ఇలాంటి ఫీట్లన్నీ ఎక్కువగా హీరోలే చేస్తుంటారు. హీరోయిన్లు చేసేది తక్కువ కాని ..అందాల అనుష్క త్వరలో అలాంటి సాహసమే చేయబోతున్నారట. పాత్ర కోసం తన బరువుని ఏకంగా వంద కిలోలకు పెంచనున్నారట. కె.రాఘవేంద్రరావు తనయుడు కోవెలమూడి ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలిసింది. . అందులోని ఓ పాత్ర… అధిక బరువుతో అపర కాళికలా కనిపించాల్సి వస్తుందట. ఆ […]

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ 

కరణ్ జోహార్ దర్శకత్వంలో ఆమె మళ్లీ వెండితెర కు ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ ఇవ్వబతున్నారు. సినిమాకు ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే టైటిల్ ఖరారు చేసారు ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, అనుష్క శర్మ కూడా నటించనున్నారు. వచ్చే ఏడాది జూన్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఐశ్వర్యరాయ్ మళ్లీ వెండి తెరపై మెరవడానికి సిద్దంగా ఉండటంతో ఆమె ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. […]