మాజీ మిస్ వరల్డ్ అందాల రాశి ఐశ్వర్యరాయ్‌కి లండన్‌లో ఘన సత్కారం జరిగింది…..
తన తల్లి బ్రింద్య రాయ్, భర్త అభిషేక్ బచ్చన్‌తో పాటు కూతురు ఆరాధ్యతో ఈమె స్టేజీపై సందడి చేసింది. తనకు జరిగిన సత్కారానికి ఐశ్వర్య మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపింది. 1994లో ఐశ్వర్యకు మిస్ వరల్డ్ టైటిల్ లభించి 20 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ మోస్ట్ సక్సెస్‌ఫుల్ మిస్ వరల్డ్‌గా ఈమెను పరిగణిస్తూ..‘ బ్యూటీ విత్ ఎ పర్పస్ ’ అంటూ మిస్‌వరల్డ్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రకటించింది.