శంకర్ దర్శకత్వంలో అజిత్ చిత్రం …..
శంకర్ దర్శకత్వంలో అజిత్ చిత్రం ….. ఆరంభం, వీరమ్.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్నారు అజిత్. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఎన్నయ్ అరిందాల్’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తదుపరి శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అజిత్ అంగీకరించారట. శంకర్‌తో ‘భారతీయుడు’ వంటి సూపర్ హిట్ నిర్మించిన ఏయం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తారని చెన్నయ్ టాక్.
కురూపి పాత్ర కోసం పన్ను ఊడగొట్టుకున్నా… విక్రమ్
విక్రమ్ అనగానే శివపుత్రుడు, అపరిచితుడు వంటి భిన్నమైన పాత్రలు పోషించిన నటుడు ఆయనలో గుర్తుకువస్తాడు. చేసింది తక్కువ చిత్రాలైనా అన్నీ కొత్తకోణంలోనే వుంటాయి. బాలీవుడ్‌లోనూ ‘రావణ్’తో ముందుకు వచ్చిన విక్రమ్ ఈసారి తమిళం, మలయాళం, హిందీతో కలిసి మూడు భాషల్లోనూ చేసిన చిత్రం ‘ఐ’. తెలుగులో అదే పేరుతో డబ్ చేయబడింది. చిత్రం ప్రమోషన్లో భాగంగా విక్రమ్ సోమవారం నాడు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “బరువు పెరగడం, తగ్గడంతో పాటు… ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి […]
శంకర్ – విక్రమ్‌ల ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ’ విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే
శంకర్ – విక్రమ్‌ల ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ’ విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే భారతీయ సినిమా మొత్తం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న శంకర్ – విక్రమ్‌ల ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ’ విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. ఈ చిత్రాన్ని నిర్మించిన ఆస్కార్ రవిచంద్రన్ తమ వద్ద తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేవరకు ‘ఐ’ విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓ తమిళ నిర్మాణ సంస్థ కోర్టుని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల […]
విక్రమ్ ‘ఐ’ రన్ టైం బాగా ఎక్కువ
యావత్ సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ‘ఐ’ సినిమా రన్ టైం 3 గంటల 8 నిమిషాలు(188 నిమిషాలు) అని సమాచారం. ప్రస్తుతం ఈ రన్ టైం ఉన్న సినిమాని సెన్సార్ కి పంపుతున్నట్లు తెలిసిందే. సెన్సార్ పూర్తైన తర్వాత ఇందులో ఒక 8 నిమిషాలు కట్ చేసి టోటల్ గా 3 గంటల సినిమాని రిలీజ్ చేసేలా ఈ చిత్ర […]
శంకర్ దర్శకత్వంలో చిరంజీవి చిత్రం!!
మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న చిరంజీవి మళ్లీ సినిమాల్లో నటిస్తానని ప్రకటించారు. 149 చిత్రాలను పూర్తి చేసుకున్న చిరంజీవి 150వ చిత్రంకథ కోసం ఎదురు చూస్తున్నారు. దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించాలన్న ఆసక్తిని చిరంజీవి ఇటీవల వ్యక్తం చేశారు. ఆసక్తికర విషయం ఏమిటంటే చిరంజీవితో చిత్రం చేయడానికి శంకర్ రాయబారం చేస్తున్నట్టు తాజా సమాచారం.
తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కించిన ‘ఐ’ సినిమా ఆడియో
తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కించిన ‘ఐ’ సినిమా ఆడియో ఆవిష్కరణోత్సవం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ… తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉన్నానని, భవిష్యత్ లో తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తానని చెప్పారు. ఇది త్వరలోనే కార్యరూపం దాలుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మగధీర సినిమా చూసి రాజమౌళి అభిమాని అయ్యాయని శంకర్ అన్నారు. ‘ఐ’ సినిమా అందరినీ అలరిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
శంకర్ ‘ఐ’ విడుదల తేదీ హమ్మయ్య!
విక్రమ్, శంకర్ ల భారీ చిత్రం ‘ఐ’ . ఈ చిత్రం రిలిజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి రాదంటూ వార్తలు వచ్చాయి. దాంతో అభిమానులు కంగారుపడ్డారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ తేదీ ని ప్రకటించారు. జనవరి 9న ఈ చిత్రం విడుదల చేస్తామని తేదీని ఖరారు చేసినట్లు తమిళ వర్గాల సమాచారం. ఇప్పటికే మృగరాజు వేషంలో ఉన్న ప్రచార చిత్రం అందరినీ ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచుతోంది.