‘రన్‌రాజా రన్’ ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ తర్వాతి చిత్రం ఉంటుందట!.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘బాహుబలి షూటింగ్ దాదాపు పూర్తికావచ్చిన సందర్భంగా ఆయన తర్వాతి చిత్రంపై అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. అయితే ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని చేయడానికి ఓకే చేశాడని సమాచారం. ఇటీవలే ‘రన్‌రాజా రన్’వంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో చిత్రం ఉంటుందట!., ప్రభాస్ కజిన్ ప్రమోద్ దీనిని నిర్మిస్తారట…..