మణిరత్నం దర్శకత్వంలో ధనుష్‌కి నటించే ఛాన్స్
మణిరత్నం దర్శకత్వంలో ధనుష్‌కి నటించే ఛాన్స్… మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి హీరోలు, హీరోయిన్లు ఉవ్విళ్ళూరుతుంటారు. వాళ్లల్లో తమిళ హీరో ధనుష్ కూడా వున్నాడు. అతని కోరిక త్వరలోనే తీరుతోంది. మణిరత్నం దర్శకత్వంలో నటించే ఛాన్స్ ధనుష్‌కి తాజాగా వచ్చినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం తమిళంలో తాను చేస్తున్న చిత్రం పూర్తవగానే మణిరత్నం హిందీలో స్ట్రెయిట్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో హీరో పాత్ర కోసం ధనుష్‌ను సంప్రదించినట్టు తెలిసింది.