‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ పథకాన్ని ప్రారంభిచిన మోడీ
గ్రామాల అభివృద్ధి‑తోనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. . గ్రామాభివృద్ధికి గాంధీజీయే మనకు స్పూర్తి ప్రధాత అని అన్నారు. పేదలు, రైతుల కోసమే గ్రామ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనను ప్రారంభించినట్లు చెప్పారు. పేదల అభివృద్దే మన ప్రధాన కల కావాలని మోడీ ఆకాంక్షించారు. ప్రతి పార్లమెంట్ సభ్యుడు గ్రామాభివృద్ధికి పాటుపడాలని అన్నారు. అందుకోసం తన నియోజకవర్గంలోని ఏటా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని… ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అలా 2016 నాటికి దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామాలను తయారు చేయాలని ఆకాంక్షించారు.