‘మేము సైతం’… అన్నయ్య ‘జీరో’ అవుతాడనే పవర్ స్టార్ రాలేదా…?

గ్రేటర్ ఎన్నికల భరిలోకి పవన్ జనసేన
క్రికెటర్ గా సురేశ్ రైనా పాత్రను తెరపై చెర్రీ …..

Pawan-Memusaitam---05.12మేము సైతం ప్రోగ్రాముకు టాలీవుడ్ ఇండస్ట్రీ నటీనటులు, సాంకేతిక వర్గం అంతా వచ్చింది. కానీ అందరిచూపు పవర్ స్టార్ ఎప్పుడొస్తాడా అని చూచారు. కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినపుడయినా పవన్ తళుక్కుమంటాడేమోనని ఎదురుచూశారు. కానీ పవన్ కళ్యాణ్ జాడే లేదు. పైగా ఆయన నిన్న ఆదివారంనాడు హైదరాబాదులోనే ఉన్నాడనే సమాచారం.  మరి హైదరాబాదులోనే ఉండి ఎందుకు రాలేదబ్బా అనే చర్చ కూడా జరిగింది. ఐతే దీనిపై పలువురు పలు రకాలుగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి వస్తే అన్నయ్య చిరంజీవి జీరో అయిపోతాడేమోనన్న కారణంగా ఆయన రాలేదేమోననే వాదనలు వినబడుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి సభలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం నినాదాలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మొన్నీమధ్య నితిన్ చిత్రం ఆడియో కార్యక్రమంలోనూ నాగార్జున వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అంటూ గొడవ చేశారు. అందువల్ల తనకంటే పెద్దవారిని ఇబ్బంది పెట్టడం ఎందుకనే ఉద్దేశ్యంతో పవన్ డుమ్మా కొట్టాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

గ్రేటర్ ఎన్నికల భరిలోకి పవన్ జనసేన
క్రికెటర్ గా సురేశ్ రైనా పాత్రను తెరపై చెర్రీ …..

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *