కర్నూలు జిల్లావాసులకు కొత్త అవతారంలో పవన్…!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంత కాలం తన రాజకీయాలతో జనాన్ని ఉర్రూతలూగించారు. అయితే ఆయన కర్నూలు జిల్లావాసులకు కొత్త అవతారంలో కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ సేద్యం చేస్తున్నాడని మీకు తెలుసా… ? ఇది నిజం ఆయన ఎక్కవ కాలంత తన వ్యవసాయ క్షేత్రంలో గడిపేస్తున్నారు. ఎలాగో తెలుసా..! అక్కడే సేంద్రియ ఎరువులతో పంటలను పండించే కార్యక్రమంలో బిజీబీజీగా గడుపుతున్నారట. ఈ పంటలను సాగు చేయడంలో పవన్ కళ్యాణ్ కు విజయరామ్ సలహాలు సూచనలిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయరామ్ త్వరలో కర్నూలులో ఒక కిసాన్ మేళాను నిర్వహించనున్నారట. సేంద్రియ సేద్యంపై సందేశం ఇవ్వడానికి ఆ కిసాన్ మేళాకు రావాలని విజయరామ్ పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దాదాపుగా 3000 మంది రైతులు హాజరుకానున్నారు.