taurine side effects

International News

All Other Places

Happy Birth Day to Subhas Chandra Bose

Subhas Chandra Bose was an Indian nationalist whose attempt during World War II to rid India of British rule with the help of Nazi Germany and Japan left a troubled legacy. The honorific Netaji  first applied to Bose in Germany, by the Indian soldiers of the Indische Legion and by the German and Indian officials in the Special Bureau for India in Berlin, in early 1942, is now […]

అమెరికా అధ్యక్షుడు ఒబామా కోసం ఆగ్రాలో భారీ భద్రత

తాజ్‌మహల్ సందర్శనకు ఈ నెల 27న వస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా కోసం ఆగ్రాలో భారీ భద్రత ఏర్పాటుచేశారు. వంద మంది అమెరికా భద్రతాధికారులతోపాటు నాలుగు వేల మంది భారత బలగాలు ఒబామాకు రక్షణగా నిలువనున్నాయి. భద్రతా ఏర్పాట్లకు తుదిరూపు ఇచ్చేందుకు నాలుగువేల మంది స్థానిక పోలీసులు, పారామిలిటరీ బలగాలు, వందమంది అమెరికా భద్రతాధికారులతో పటిష్ఠమైన భద్రత ఏర్పాటుచేస్తున్నాం అని ఎస్‌ఎస్‌పీ ఆగ్రా రాకేశ్ మోదక్ తెలిపారు. భద్రతా కారణాలతోపాటు దృష్టి మరల్చడానికి జరిగే దాడులను నివారించడానికి […]

గిన్నీస్ బుక్ లో జన్‌ధన్ యోజన…..

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలన్న సదుద్దేశ్యంతో ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన. ఇది గిన్నీస్ రికార్డులకెక్కింది. కేవలం ఐదు నెలల్లో 11.5 కోట్ల బ్యాంకు ఖాతాలను జన్‌ధన్ యోజన కింద తెరిచారు. దానిని గుర్తించిన గిన్నీస్ రికార్డు అధికారులు ఈ పథకానికి అధికారికంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ పథకం కింద ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయల […]

జీవిత రాజశేఖర్‌కు బంపర్ ఆఫర్…

ఇటీవల బీజేపీలో చేరిన సినీ నటి జీవితా రాజశేఖర్‌కు బంపర్ ఆఫర్ తగిలింది. ఈ దంపతుల్లో జీవితను కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా ఎంపిక చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ తన పదవికి పూర్తిగా న్యాయం చేస్తానని చెప్పారు. ఇరవై ఏళ్లుగా సినీ రంగంలోనే ఉన్నానని… అదే రంగానికి చెందిన పదవి దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఒబామా పర్యటనకు గట్టి భద్రత……..

గణతంత్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి భారత్‌కు వస్తోన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కోసం దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు కంచుకోటగా మారనున్నాయి……. ఇంతవరకు ఏ విదే శీ నేతకూ కల్పించనంత గట్టి భద్రతను ఏర్పాటుచేస్తున్నారు. ఆయన బసచేసే మౌర్య షెరటాన్ హోటల్ వద్ద 300 మంది ఢిల్లీ పోలీసులు ఒబామా రాకకు 72 గంటల ముందే మోహరించనున్నారు. ఒబామా సందర్శించే ప్రాంతాలు, వాటి  పరిసరాల్లో రాకపోకలను నియంత్రిస్తారు. ఈ నెల 27న ఒబామా […]

అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన నేపథ్యంలో పాక్‌కు చెందిన ఉగ్రవాదుల దాడులకు ముందస్తు హెచ్చరిక….

అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన నేపథ్యంలో పాక్‌కు చెందిన ఉగ్రవాదుల దాడులకు ముందస్తు హెచ్చరిక పాకిస్థాన్‌కు అమెరికా గట్టి హెచ్చరికలు చేసింది. పర్యటన సమయంలో సరిహద్దులో ఎలాంటి ఉగ్రదాడుల ఘటనలు జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. గతంలో అమెరికా అధ్యక్షులు భారత పర్యటనకు వచ్చిన సమయంలోనే పాక్‌కు చెందిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన నేపథ్యంలో అమెరికా ఈ ముందస్తు హెచ్చరికలు చేసింది.

Today N. Chandrababu Naidu meets the Prime Minister, Shri Narendra Modi

The Chief Minister of Andhra Pradesh, N. Chandrababu Naidu meets the Prime Minister, Shri Narendra Modi , in New Delhi today.

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ పర్యటన షెడ్యూల్‌…..

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ పర్యటన షెడ్యూల్‌…… భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడురోజులపాటు ఒబామా సతీసమేతంగా భారత్‌లో పర్యటించనున్నారు. భారతదేశ గణతంత్ర వేడుకల్లో తొలిసారి అమెరికా అధ్యక్షుడు పాల్గొంటున్నారు. ఒబామా తన భారత పర్యటనలో భాగంగా..25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై వీరి నడుమ చర్చ జరగనుంది. […]

తండ్రి ఆస్తులను ప్రభుత్వానికి రాసిన – సీఎం నవీన్ పట్నాయక్

ఒడిశా అనగానే ముందుగా రాజకీయ నాయకులకు గుర్తుకు వచ్చే పేరు నవీన్ పట్నాయక్. ఎప్పుడూ తెల్లటి లాల్చీ, పైజమా మాత్రమే ధరించి ఉండే నవీన్ పట్నాయక్.. ఇప్పుడు మరింత నిరాడంబరత ప్రదర్శించి, తండ్రి ఆస్తులను కూడా ప్రభుత్వానికి ఇచ్చేశారు. 1997లో తన తండ్రి మరణించిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి పేరుమీద బిజూ జనతాదళ్ అనే పార్టీని స్థాపించారు. ఆస్తులను ప్రభుత్వానికి రాసి ఇచ్చే వారు ఎంత మంది ఉంటారు అసలు ఉండరు కదూ కానీ […]

4జీ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో అడుగు పెట్టబోతోంది

4జీ వచ్చేస్తోంది. ఫిబ్రవరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో ఈ సేవలను ఆరంభించేందుకు టెలికం సేవల సంస్థ ఎయిర్‌టెల్ సిధ్ధం. జూన్‌ కల్లా రిలయన్స్ జియో కూడా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 4జీతో అడుగు పెట్టబోతోంది. దేశవ్యాప్తంగా 800నగరాల్లో సేవలందించేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. 3జీతో సాధ్యం కాని లైవ్ ఫీడ్ ట్రాన్స్‌మిషన్ వంటి సేవల్ని ఈజీగా సాకారం చేయటానికి… 3జీతో పోలిస్తే 5 రెట్ల వరకు వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసు అందించడానికి 4జీ వచ్చేస్తోంది.  పరిస్థితులు అనుకూలించగానే 4జీ సేవలు […]