ధైర్యానికి, సాహసానికా ప్రతీక అయిన నేతాజీ బతికున్నారా? మరణించారా? …..
ధైర్యానికి, సాహసానికా ప్రతీక అయిన నేతాజీ బతికున్నారా? మరణించారా? అన్నదానిపై నేటికీ సస్పెన్స్ నెలకొని ఉంది.
నేతాజీ సుభాస్ చంద్రబోస్ తాజాగా బతికే ఉన్నారని, ఆయన భద్రతకు హామీ ఇస్తే కోర్టులో హాజరు పరిచేందుకు సిద్ధమని తమిళనాడులో పీటర్ రమేశ్ కుమార్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. నేతాజీ బతికున్నారన్న దానికి ఆధారమంటూ ఆయన రమేశ్ కుమార్ ఓ ఫొటోను కోర్టుకు సమర్పించారు. మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. అనుమతిస్తే కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.
నేతాజీ యుద్ధ నేరస్తుడు కావడంతో, ఆయనను బ్రిటీషర్లకు అప్పగిస్తామని గతంలో కేంద్రం ప్రకటించిందని, ఆ ఒప్పందం ఇప్పటికీ అమల్లో ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. అందుకే, నేతాజీని అప్పగించబోమని కేంద్రం స్పష్టం చేస్తేనే ఆయనను కోర్టు ఎదుట హాజరుపరుస్తామని పిటిషనర్ తెలిపారు.