కర్నూలు జిల్లా అవుకు మండలం మెట్టుపల్లె గ్రామ సమీపాన వేగటాళ్ల ఉచ్చులో చిరుత….
ఎర్రమల కొండల్లోని నీటికుంటలో నీరు తాగేందుకు వచ్చి ఉచ్చులో చిక్కుకుని ఉండవచ్చని, ఈ చిరుతకు ఒకటిన్నర సంవత్సరం వయస్సు ఉంటుందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు.
అటుగా వెళ్తున్న పశువులకాపరులకు చిరుత గాండ్రింపులు వినపడి పోలీసులకు సమాచారం అందించారు. కర్నూలు డీఎఫ్‌వో మహబూబ్ బాషా, డోన్ డివిజన్ ఫారెస్టు ఆఫీసర్ అశోక్‌కుమార్‌రెడ్డి తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి చిరుతకు మత్తుమందు ఇచ్చి బోన్‌లోకి ఎక్కించారు చిరుతకాలికి చిన్నపాటి గాయం కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించి తిరుపతిలోని జూకు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.