చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న హంపి ఉత్సవాలు జనవరి 9, 10, 11వ తేదీల్లో..
చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న హంపి ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరిలో మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.
జనవరి 9, 10, 11వ తేదీల్లో జరిగే ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు… ఉత్సవాలను కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రారంభిస్తారు. ఉత్సవాల కోసం ఐదు వేదికలు సిద్ధం
1. శ్రీకృష్ణదేవరాయ వేదిక,
2.ఎంపి.ప్రకాశ్ వేదిక,
3.విద్యారణ్య వేదిక
4.ధరోజి ఈరమ్మ వేదిక
5.హక్క, బుక్క వేదికల ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రఖ్యాత కళాకారులతో పలు కళాప్రదర్శనలు [చాళుక్యులు, హొయసళల కాలం నాటి శిల్పకళ శిబిరాలు] నిర్వహించనున్నారు. ఉత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.